.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి
Published by:Admin, Date:08-09-2020:06:35

నటుడు జయప్రకాష్ రెడ్డి  మంగళవారం ఉదయం  గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లోనే కుప్పకూలగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి సొంతూరు కర్నూలు  జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల.  సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ ఆయన నటించారు.ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి.రాయలసీమకు ఇమేజ్‌ తెచ్చిన విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి. అనంతపురంలో చదువుకునే టైమ్‌లో టీచర్‌ ముందు దుర్యోధన గర్వ భంగం అనే నా నాటకాలు పద్యాలుడైలాగులుబట్టికొట్టేసి అప్పజెప్పమనగా,టపటపా చెప్పేశారు. కానీ ఓ చిన్న తప్పు రావడంతో టీచర్‌ వీరిని బాగా మందలించారు. దాన్ని జయప్రకాష్‌ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నాటకాలపై పట్టు సాధించే వరకు కసరత్తులు చేశారు. ఆ కసితోనే నటన రంగంలోకి అడుగుపెట్టారు. 

 

జయప్రకాష్‌రెడ్డి ఓ సారి నల్గొండలో గప్‌చుప్‌ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకి పరిచయం చేశారు. అలా 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

 

మొదట పలు డిఫరెంట్‌ రోల్స్ చేసిన ఆయన 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా చిత్రంతో విలన్‌గా మారాడు. ఈ సినిమాతో విలన్‌గా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు చిత్రాలు విలన్‌గా ఆయనకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. అంతేకాదు రాయలసీమ యాసకి ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని తీసుకొచ్చారు.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: