అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు..
Published by:Admin, Date:08-09-2020:09:12

అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని చంద్రగిరి నియోజకర్గ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ లకు ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల నుంచి అందిన పిర్యాదుల పట్ల ఆయన ఘాటుగా స్పందించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వ నిబంధనల మేరకే చెల్లింపులు జరగాలని సూచించారు. తుడా కార్యాలయంలో మంగళవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ లు, రెవెన్యూ అధికారులతో చెవిరెడ్డి సమీక్షించారు.  ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పారదర్శక పాలనకు అధికారులు అలవాటుపడాలన్నారు. తప్పులు చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండేలా  ప్రతి ఒక్క అధికారి సిద్దం కావాలన్నారు. ప్రభుత్వం ఏమి చెబుతోంది, నిబంధనల ఏమి చెబుతున్నాయి, సామాన్యుడు నుంచి వస్తున్న అభ్యంతరాలను అధికారులకు క్షుణ్ణంగా విశదీకరించారు.

 

నేను నిజాయితీగా ఉన్నాను..

 

నేను నిజాయితీగా ఉన్నాను.. మీరు నిజాయితీగా ఉండాలి. నా నియోజకవర్గంలో

సామాన్యుడు ఇబ్బందులు పడకూడదు. అవినీతి పాలనకు చరమగీతం పాడాలి. నేను తప్పు చేసినా నన్ను ప్రశ్నించవచ్చు. ఇక ఆపేయండి. ప్రజలు ధైర్యంగా ఉండాలి, వారికి భరోసా కల్పించేలా అధికారులు పనిచేస్తేనే ప్రజాప్రతినిధిగా మా ఎన్నిక సార్థకమవుతుంది. అవినీతి రహితంగా సేవలందించాలి. అలకాదని అవినీతికి పాల్పడితే బదిలీ పై ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోవచ్చు.. తప్పు చేసి పట్టుబడితే కుటుంబం మొత్తం దోషిగా నిలుస్తుంది. ఇకపై ఒక్క పిర్యాదు వచ్చిన సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు మాత్రమే పని చేయాలి. అతిక్రమించి చేయరాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి ఆరోపణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పెండింగ్ రిజిస్ట్రేషన్ లు  ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ వ్యవస్థను రద్దు చేసైనా సబ్ రిజిస్ట్రార్ లకు డాక్యుమెంట్ రైటర్లు  మధ్యవర్తుల్లా పనిచేస్తున్నారు. అలా ఎవరినైనా మోసం చేసినట్లు పిర్యాదు అందితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు తెలియజేశానని చెప్పారు. అతి తెలివితేటలు ప్రదర్శించి డాక్యుమెంట్లు రిజెక్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. డాక్యుమెంట్ రిజెక్ట్ చేయాలంటే కారణాలు తప్పక సూచించాలి.. అక్నాలడ్జ్ మెంట్ ఇవ్వాలన్నారు. భూ స్వరూపాలను మార్పులు చేసి రిజిస్ట్రేషన్ లు చేస్తున్నారని హెచ్చరించారు. తుడాకు మార్ట్ గేజ్ చేసిన భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉదహరించారు. మీరు తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక డబ్బు కోసం చేసే తప్పులు బాధితులను సంవత్సరాలుగా కోర్టులు చుట్టూ తిరుగుతూ ఆవేదనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇటీవల మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు.. ఆ భూములను రిజిస్ట్రేషన్ లు చేయడాన్ని తప్పుబట్టారు. వీఆర్ఓ లు ఎంజాయ్ మెంట్ సర్టిఫికేట్ ఇస్తే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటన్నారు. తప్పక తహశీల్దార్ ఆమోదం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ పాలసీ విషయాల్లో కమిటీ తో చర్చించకుండా భూ విలువల పెంపున కు ప్రతిపాదించడం సరికాదని సబ్ రిజిస్ట్రార్ లకు సూచించారు.  పారదర్శక రిజిస్ట్రేషన్లు సాగాలని ఆకాంక్షించారు. భూ రిజిస్ట్రేషన్ లు సులభతరంగా చేపట్టేందుకు ప్రతి  పంచాయతీల్లో భూ వివరాలు భూ విలువ, రిజిస్ట్రేషన్ ధరలతో కూడిన ప్రతులను అందుబాటులో ఉంచాలన్నారు. తప్పుకు పాల్పడితే జీవితకాలం బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కుటుంబ సభ్యుల్లా మెలుగుదాం.. చక్కటి పాలనను ప్రజలకు అందిస్తామని పిలుపునిచ్చారు. తుడా ప్రణాళిక విభాగంలో కూడా పారదర్శక పాలన అందించేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: