లోకేష్ గారు ...దీన్నే కక్షసాధింపు అంటారు
Published by:Admin, Date:09-09-2020:03:33

కక్షసాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీమాజీ  మంత్రులు ,నాయకులు ,కార్యకర్తలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బుధవారం మరోసారి ఆరోపించారు .కక్ష సాధింపు ను వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు .తాము కక్ష సాధింపు చర్యలు చేయలేదని, భవిష్యత్తులోనూ చేయబోమని చెప్పాల్సిన బాధ్యత కలిగిన లోకేష్ కక్ష సాధింపునువడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడంతో దీన్నే కక్షసాధింపు అంటారు లోకేష్ బాబు గారు ...అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు . ఆయన ఇంకా ఏమన్నారంటే .....రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమ కేసులు పెడుతోంది.రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయిహత్య కేసులో కావాలని కొల్లు రవీంద్ర నుఅరెస్ట్ చేశారు

కొల్లు రవీంద్ర సౌమ్యుడు ఎలాంటి తప్పు చేయడు.లెటర్ రాస్తే అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారు.ఈఎస్ ఐ లో మంత్రికి ఎలాంటి ప్రమేయం ఉండదు.36 మంది టిడిపి నేతలపై దొంగ కేసులు పెట్టారు.18 నెలలు అవుతుంది.. అవినీతి నిరూపించారా?జగన్ తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నాడు.మళ్ళీ అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందిజగన్ కు, మంత్రులకు చెపుతున్నా వడ్డీతో సహా చెల్లిస్తాం.వదిలి పెట్టే ప్రసక్తే లేదు.కరోనా వలన ఓపిక పడుతున్నాం.రాబోయే రోజుల్లో మేము ఏంటో చూస్తారు ,డబుల్ స్పీడ్ తో ముందుకు వెళతాం.ఒక మతంపై దాడి జరుగుతోంది.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు.మంత్రులకు చంద్రబాబు కలలోకి వస్తున్నాడు.ఆలయాలు కూల్చుతుంటే జగన్ ఏమి చేస్తున్నారు.. ఇంట్లో కూర్చొని.. సినిమా చూస్తున్నారా ?మంత్రి కొడాలి నాని ప్రస్టేషన్ లో అందరిపై దుర్బాష లాడుతున్నారు.మంత్రులకు ప్రస్టేషన్ ఎక్కువ అయ్యింది.అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారుfb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: