ఏకాంతంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు
Published by:Admin, Date:09-09-2020:05:52

 

 

          తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.  బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబ‌రు 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల‌కు, టిటిడి ఉద్యోగుల‌కు ఈ వ్యాధి వ్యాపించ‌కుండా నివారించేందుకు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.

 

సెప్టెంబ‌రు 19న - ధ్వ‌జారోహ‌ణం

 

సెప్టెంబ‌రు 23న - గ‌రుడ‌సేవ‌

 

సెప్టెంబ‌రు 24న - స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) 

 

సెప్టెంబ‌రు 26న - ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)

 

సెప్టెంబ‌రు 27న - చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.

 

       కాగా, కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో సెప్టెంబ‌రు 24న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం, సెప్టెంబ‌రు 26న ర‌థోత్స‌వం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేంచేపు చేస్తారు.

 

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: