ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల అద‌న‌పు కోటా విడుద‌ల‌
Published by:Admin, Date:09-09-2020:10:07

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల అద‌న‌పు కోటాను టిటిడి బుధ‌వారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. సెప్టెంబ‌రు 10 నుండి 30వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 3 వేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

 

           క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల‌ను సెప్టెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు టిటిడి తాత్కాలికంగా నిలుపుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భ‌క్తుల కోరిక మేర‌కు అద‌నంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. 

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: