చంద్రబాబు ,లోకేష్ జల్సాల ఖర్చు వందల కోట్లు
Published by:Admin, Date:10-09-2020:08:24

పారదర్శకంగా జగన్ పాలన సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన రాయచోటి వై ఎస్ ఆర్ సి పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి పారదర్శకంగా ప్రజలందరికీ సమానత్వం కల్పించి పరిపాలన చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమన్నారు.సంక్షేమ పథకాల విషయంలో, నీటిపారుదల విషయంలో ఓ అడుగు పడిందంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ తోనేనన్నారు.కులం ఉండదు, మతం ఉండదు, జెండా ఉండదు, పార్టీ ఉండదు, ప్రజలందరూ సమానం.. దళారులు లేకుండా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మనదే అని గర్వంగా చెబుతున్నామన్నారు.పథకాలు ప్రజలకు అందాలంటే రూపాయి మంజూరైతే లబ్దిదారునికి చేరేసరికి 10 పైసలు చేతికందేవని రాజీవ్ గాంధీ చెప్పేవారని ఆయన గుర్తు చేశారు.రూపాయికి రూపాయి నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి జమఅవుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు.ఏ పని చేయకుండా గ్రాఫిక్స్ పరిపాలనా చేసిన నాయకుడు, నేడు జగన్మోహన్ రెడ్డికి మంచిపేరు వస్తుందని ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని కించపరచాలి, ఎలా దెబ్బకొట్టాలి అని రాత్రింబవళ్ళు కుయుక్తులు,   ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.30 లక్షల మందికి సుమారు 30 వేల కోట్ల రూపాయల  ఆస్తిని పంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టిడిపీకి ఇష్టం లేదని తెలుస్తుందన్నారు. అమరావతిలో 60వేల మంది పేదవారు అక్కడికివస్తే టిడిపి మనసు నొచ్చుతుందని కోర్టుకెళ్ళారంటే టిడిపి దుర్మార్గం అర్థమవుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆధునిక సమాజంలో ఉన్న మనం పేదవారు, బడుగుబలహీనవారిని వేరుచేసి మాట్లాడేవారు ఈ సమాజంలో ఉన్నారంటే టిడిపి నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.రాజధానిలో అందరూ సమానంగా నివసించే ప్రాంతం ఉండాలని పేదవారికి పట్టాలిస్తే చాలు, నాకు మంత్రి పదవి లేకపోయినా పర్వాలేదని ధైర్యంగా  మంత్రి కొడాలి నాని చెప్పారని,  ఆ ధైర్యం టిడిపికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పేదవారు 10 లక్షల ఆస్తిపరులు కావడం టిడిపికి ఇష్టం లేదన్నారు.పట్టాలు పొందినవారు 5 ఏళ్ళ తరువాత తమ అవసరాల కోసం తాకట్టు పెట్టుకోవడం , అమ్ముకోవడం వంటివి చేసుకోవచ్చునన్నారు. పేదవారు ఇంగ్లీషు చదవడంకూడా చంద్రబాబుకు ఇష్టం లేనందునే కోర్టుకు వెళ్లారన్నారు. చంద్రబాబు మనవడిని తెలుగు మీడియంలో చేర్పిస్తాడా ? అని ఆయన ప్రశించారు.

తెలుగుపైన ప్రేముంటే, కోర్టులో ఇంగ్లీషు మీడియంపై స్టే వేసిన తెలుగుదేశం నాయకులందరూ వారి పిల్లలను తెలుగు మీడియం చదివించండి, డ్రామాలు, నాటకాలు ఎందుకు ? అని ఆయన హితవు పలికారు.

యస్టీ, యస్సీ, బీసీలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ? వారు అనుర్హులా  అని ప్రశించారు. ప్రమాదవశాత్తూ  ఎక్కడైనా చిన్నచిన్న సంఘటనలు జరిగితే కుల, మతాలను రెచ్చగొట్టడమేంటని ఆయన నిలదీశారు. నాయకుడంటే క్రెడిబిలిటీ ఉండాలి, పూటకో మాట మాట్లాడే చంద్రబాబు లాంటి నాయకులు సమాజంలో ఉన్నారంటే సిగ్గుపడాలన్నారు.

అమరావతి రైతులకు మీ కంటే బాగా, మా ప్రభుత్వం  ఎక్కువగా  ఆదుకుంటోందనన్నారు. ప్రభుత్వ 

పాఠశాలలను కార్పొరేట్ పాఠాశాలలకు ధీటుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. విద్యార్థులుకు  పౌష్ఠికాహారం బాగుండాలని, బట్టలు, షూస్ వంటి ప్రతి ఒక్కటి తానే స్వయంగా  ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తున్నారని, ఈ విధంగా కృషి చేస్తున్న   ఏ ముఖ్యమంత్రినైనా గతంలో  చూశామా అని అన్నారు.చంద్రబాబు హయాంలో నిలిచిన  బకాయిలు, ఫీజు రీయంబర్స్ మెంట్,  ఆసుపత్రుల బిల్లులనూ ఈ ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.

గతంలో ఓ యం.ఆర్.వో.పై దాడి జరిగితే ఇంట్లో కూర్చోబెట్టి పంచాయితీ చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు సొంత పార్టీ యంయల్ఏ. అయినా సరే పోలీసు అధికారి అయినా సరే తప్పుచేస్తే చర్యలు ను ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్నారన్నారు.ఐ.ఏ.యస్. అధికారిని మెడబెట్టి టిడిపి యం.యల్.ఏ, యం.యల్.సి. లు  బయటికి తోస్తే ఇంట్లో పంచాయితీ చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

చంద్రబాబుకు, జగన్ కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనబడుతోందన్నారు.చిన్న చిన్న పొరపాట్లు ను  ఎత్తి చూపితే సరిదిద్దుకుంటామని చెబుతున్నామని, కానీ మీ ప్రభుత్వంలో లోటుపాట్లు ఎత్తిచూపితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆయన గుర్తు చేశారు.గండికోటలో 23 టియంసిల నీరు  నిలబడే అవకాశం ఉన్నా ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు.  రైతులుకు ఆర్ అండ్ ఆర్ క్రింద   11 లక్షల రూపాయలు ఇస్తూ,  23 టియంసిల నీరు నిలబెడుతుంటే వైసిపి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని బురద జల్లుతున్నారన్నారు.30 లక్షల క్యూసెక్కుల  వరద వచ్చిన కూడా రాత్రింబవళ్ళు పనులు చేస్తున్న ఘనత ఈ  ప్రభుత్వందేనన్నారు.పోలవరం చూద్దాం రారండి అంటూ పాట పాడుతూ ప్రత్యేక ఏ సి బస్సులు, బిర్యానీ ల కోసం వంద కోట్ల    రూపాయలను ఖర్చు  పెట్టారన్నారు. సోమవారం  పోలవరం అంటూ పోయావ్  ఏమిచేశావ్ ? కోట్లు, కోట్లు ఖర్చు పేరుతో మింగడం తప్పా  ఏ మైనా చేసారా అని ఆయన నిలదీశారు. వైజాగ్ విమానాశ్రయంలో తండ్రీ   కొడుకులు స్నాక్స్ కోసం 24 కోట్లును ఖర్చుపెట్టారన్నారు. ముఖ్యమంత్రిగా  హైదరాబాద్ లోని ఇల్లు రిపేరు సమయంలో హోటల్లో ఉండేందుకు రూ. 240 కోట్ల బిల్లు చేశారన్నారు.అమరావతి, అమరావతి అంటున్న చంద్రబాబు తన నివాసానికి ఒక ఇల్లు అయినా కట్టారా అని ఆయన ప్రశించారు. అమరావతిని 4 సంవత్సరాల్లో అద్భుత నగరంగా నిర్మిస్తానన్నావు.. ఏమి చేశావు ? దావోస్ కు 5 సార్లు వెళ్ళావు ఏమి సాధించావని చంద్రబాబును నిలదీశారు.ప్రస్తుతం జరుగుతున్న పోలవరం పనులపై పబ్లిసిటీకోసం చంద్రబాబు విపరీతంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారన్నారు. 

జగన్ ఎక్కడా ప్రచారానికి పోలేదన్నారు.50వేల కోట్ల రూపాయలను   ప్రజల ఖాతాలో వేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. కోవిడ్ సమయంలో విజయవాడకు  రాకుండా హైదరాబాదులో చంద్రబాబు దాక్కున్నారని,నీ ప్రాణంపైన తీపి ఉన్నప్పుడు ప్రజలకోసం ఏమి చేయలేవన్నారు. వ్యవస్థలను చేతులో పెట్టుకొని ఇప్పుడు కూడా అధికారంలో  ఉన్నట్లు  చంద్రబాబు భ్రమ పడుతున్నారన్నారు.మీరు తప్పుచేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని మూలన కూర్చోబెట్టారన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: