అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు
Published by:Admin, Date:10-09-2020:08:58

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్న విషయం అందరికీ తెల్సిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అపోహలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోనూ, సోషల్ మీడియా పరంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. 

కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. 

 

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ..  రేపు జీవో వెలువడనుంది.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: