రాజధాని ఎక్కడ పెట్టాలో జగన్ ప్రభుత్వం ఇష్టం: జెపి
Published by:Admin, Date:11-09-2020:02:08

ప్రజలెనుకున్న ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ తప్పుబట్టారు. ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా మన రాష్ట్రం పేరెత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికైన ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. మంచో చెడో పక్కన పెట్టండి.. మనకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఒకసారి ఓటువేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, మీరు చేయకూడదనడం సరైంది కాదు. దానికి కోర్టులుగానీ మరొకటిగానీ పరిష్కారం కాదు’.. అని జయప్రకాష్‌ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు, కోర్టులు, చట్టసభలు తమతమ పాత్రలు పోషించాలనిఅన్నారు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు సబబేన నిజగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: