రామానుజయ మృతికి చంద్రబాబు సంతాపం
Published by:Admin, Date:11-09-2020:02:54

 

చలమలశెట్టి రామానుజయ మృతికి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రామానుజయ మృతి వార్త విని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమం కోసం రామానుజయ చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. కాపు రిజర్వేషన్లు, విద్యార్థుల విదేశీ విద్య, రుణ మేళాలు, జాబ్ మేళాలు, మహిళల స్వయం ఉపాధి పథకాల రూపకల్పనలో రామానుజయ క్రియాశీల పాత్ర పోషించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రామానుజయ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు.. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: