ఉద‌యా‌స్త‌మాన సేవ, వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని టికెట్లు పొందిన భ‌క్తుల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం
Published by:Admin, Date:15-09-2020:08:00

 

 

 

 

       తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు  కోవిడ్ - 19 కార‌ణంగా సెప్టెంబ‌రు 11వ తేదీ నుండి విఐపి బ్రేక్ ద‌ర్శనాలు క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే.  

 

       కోవిడ్ - 19 కార‌ణంగా ఈ ఏడాది మార్చి 13వ తేదీ నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ర‌ద్ధు చేసిన విష‌యం తెలిసిందే. ఉద‌యా‌స్త‌మాన సేవ టికెట్లు పొందిన గృహ‌స్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు పొందిన భక్తులతో పాటు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు.

 

-  ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని దాత‌తో పాటు 5 మంది  భ‌క్తులను బ్రేక్ ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వీరు ద‌ర్శ‌నం చేసుకోవ‌లనుకున్న తేదీకి ముందు రోజు సాయంత్రం 5 గంట‌లలోపు తిరుమ‌ల‌లోని ఆర్జితం కార్యాల‌యంలో త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

 

- ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు పొందిన‌వారు కూడా 65 సంవ‌త్స‌రాల‌లోపు, 10 సంవ‌త్స‌రాల పైబ‌డి ఉండాలి.

 

- ఇత‌ర వివ‌రాల‌కు ఆర్జితం కార్యాల‌యం ఫోన్ నెం - 0877-2263589 లేదా ఇ - మెయిల్ arjithamoffice@gmail.com కు సంప్ర‌దించాలి.

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: