ఎంపి శ్రీ బ‌‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతికి సంతాపం
Published by:Admin, Date:16-09-2020:10:02

తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ బ‌‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజ‌న‌ల్ ఇన్‌చార్జ్‌), టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీ దుర్గాప్ర‌సాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుప‌త్రిలో మృతి చెందారు.

 

                సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌ శ్రీ దుర్గాప్ర‌సాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించార‌ని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు. 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన శ్రీ దుర్గాప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌ట్ల వెనువెంట‌నే స్పందించేవార‌ని నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీర‌ని లోట‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: