శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు                       
Published by:Admin, Date:17-09-2020:07:08

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం నుండి గురువారం సాయంత్రం డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌కు అందించారు.  

 

         అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం రంగ‌నాయ‌కుల మండ‌పంలోని శేష‌వాహ‌నంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 19వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. 

 

            ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో (రెవెన్యూ మ‌రియు పంచాయ‌తి) శ్రీ విజ‌య‌సార‌ధి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, ఎఫ్‌ఆర్‌వోలు శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ స్వామి వివేకానంద‌, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీర‌బాబు పాల్గొన్నారు.     fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: