టీడీపీకి షాక్ ఇచ్చినఎమ్మెల్యే గణేష్ మరో రెండు వికెట్లు పడితే చంద్రబాబు పదవి గల్లంతు ?
Published by:Admin, Date:19-09-2020:03:07

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.విశాఖ సౌత్ ఎమ్మెల్యే ,విశాఖ నగరతెలుగుదేశం   పార్టీ అధ్యక్షుడు  వాసుపల్లి గణేష్ శనివారం  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని  కలిశారు .ఆయన కుమారుడుకి వైయస్సార్సీపి కండువా కప్పి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకిముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  ,విజయ్ సాయి రెడ్డి పాల్గొన్నారు .ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కరణం బలరాం (చీరాల ),వల్లభనేని వంశీ (గన్నవరం) ,మద్దాల గిరి (గుంటూరు) ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి దూరంగా స్వతంత్ర ఎమ్మెల్యేలుగా  కొనసాగుతున్నారు .నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగాతాము  పని చేస్తున్నామని వారు చెబుతున్నారు వారి జాబితాలో తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చేరారు .పార్టీపరంగా విశాఖ నగర అధ్యక్షుడు గా ఉన్నారు .ఇటీవలనే విశాఖ రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే !విశాఖ జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది .అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ ,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభ్యంతరం చెప్పడంతో గంటా  చేరిక వాయిదా పడింది.మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి దూరమైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుంది .fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: