విశాఖ జిల్లా టిడిపి సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా ?
Published by:Admin, Date:20-09-2020:05:47

విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ,విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి .కీలకమైన ఈ రెండు జిల్లాల నుండి తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు పెరగడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది .శనివారం విశాఖ సౌత్ ఎమ్మెల్యే ,విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసు పల్లి గణేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఆదివారం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది  .ఈ సమావేశానికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ,మాజీ ఎమ్మెల్యేలు చింతకాయల అయ్యన్నపాత్రుడు ,బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్న ఈ సమావేశానికి టిడిపి నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ,విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు ఈ  సమావేశానికి డుమ్మా కొట్టారు . ఇప్పటికే గంటా శ్రీనివాసరావు మంత్రి బొత్స సత్యనారాయణ ,సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జోరుగా పావులు కదుపుతున్నారు .ఉత్తరాంధ్రా ఇంచార్జి విజయ్ సాయి రెడ్డి ,మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తుండడంతో ఆయన చేరిక వాయిదా పడింది.విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణ బాబు  హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా  మారింది. fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: