తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు పోటీ తప్పదా ?
Published by:Admin, Date:21-09-2020:02:02

కరోనా మహమ్మారి విజృంభిస్తుంది దీంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం తో పాటు ప్రజా ప్రతినిధులు కూడా మృతి చెందుతున్నారు .ఇటీవలనే తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ ,తెలంగాణలోని మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కరోనాతో మృతి చెందిన విషయం విదితమే .తాజాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతి చెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది .ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ ,ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు,ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పలువురు కేంద్ర మంత్రులు  ఎంపీలు సంతాపం ప్రకటించారు .గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు లక్షల ఇరవై వేల మెజార్టీతో ఘన విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది .ఆరు నెలల లోపు ఎన్నిక జరగాల్సిఉంది .బీహార్ ఎన్నికలతో పాటు మృతి చెందిన ప్రజాప్రతినిధుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి . గత సంప్రదాయం ప్రకారం మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో నిలబడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు  .(నంద్యాల ఉప ఎన్నిక తప్ప )ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ,బిజెపి ,జనసేన పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది .గతంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే యం వెంకటరమణ అకాల మరణంతో  తో జరిగిన తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు .కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీ చేసింది .ఈ నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కాకపోవచ్చని రాజకీయ పార్టీలు అంటున్నాయి .వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు పేరు ప్రచారంలో ఉండగా కొంతమంది నాయకులు ఇప్పటికే తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్య నాయకులు ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారుfb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: