రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్ గిరీష నగరపాలక అధికారులకు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ సమావేశం నందు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 23, 24 తేదీలలో పర్యటించనున్నారని కమిషనర్ గిరీష తెలిపారు. ఈ నెల 23 బుధవారం మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డుమార్గన తిరుమల చేరుకుని, కొంతసేపు విశ్రాంతి తీసుకొని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయం చేరుకుని శ్రీవారికి సమర్పించి, శ్రీవారిని దర్శించుకుని రాత్రి పద్మావతి అతిధిగృహం బస చేస్తారు, 24వ తేదీ ఉదయం తిరుమల నుండి 9 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడకి బయలుదేరుతారు కనుక రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి తిరుచానూరు మీదుగా 150 బైపాస్ రోడ్ మీదుగా ఉప్పరపల్లి కూడలి వరకు, అక్కడి నుంచి పద్మావతి మహిళా కాలేజీ మీదుగా, వెస్ట్ చర్చి, పూలే విగ్రహం, బాలాజీ కాలనీ, అలిపిరి వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, స్వాగత తోరణాలు, వైయస్ఆర్ ఆసరా బ్యానర్లు ఏర్పాటు చేయాలని, రోడ్ల లో తిరిగే గోవులును గోసాల కి తరలించాలని, కుక్కలను అనిమల్ కెర్కు తరలించాలని, నగరమంతా శుభ్రం చేసి అద్దంలాగ ఉండాలని, మట్టి దిబ్బలు తొలగించాలని, ప్యాచ్ వర్క్లు ఉంటే రేపటి లోపులో ప్యాచ్ వర్క్ చేసి పూర్తిచేయాలని, రోడ్లలో ఎక్కడ అ వర్షపు నీరు నిలువకుండా చూడాలని మరియు 50 మీటర్లకు ఒక్కొక్కరి చొప్పున రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేయించాలని. 24 వ తేదీ గురువారం అలిపిరి నుంచి కరకంబాడి రోడ్డు మీదుగా ఎయిర్ పోర్ట్ ముఖ్యమంత్రి బయలుదేరతారు గనుక ఆ రోడ్డు మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం పరచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రివర్యులు తిరుమల బైపాస్ రోడ్డు వద్ద స్మార్ట్ సిటీ పనులు చూడవచ్చని ముందస్తుగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని అలా లేని యెడల మీ మీద చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషన్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రాంరెడ్డి, మేనేజర్ హాసిమ్, శానిటరీ సూపర్వైజర్ గోవర్ధన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముఖం, రెవెన్యూ ఆఫీసర్ సుధాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు మొదలగు వారు పాల్గొన్నారు.