తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ Published by:Admin, Date:24-09-2020:04:52 |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు గురువారం ఉదయం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, బి.ఎస్.యడ్యూరప్పలు కలిసి భూమిపూజ చేశారు.
తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టిటిడి లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో టిటిడి నిబంధనల మేరకు రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టిటిడి మధ్య అంగీకారం కుదిరింది.
అంతకుముందు కర్ణాటక రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ శ్రీమతి రోహిణి సింధూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతనంగా నిర్మించే వసతి సమూదాయాల వివరాలు తెలియజేశారు.
ఇందులో 242 యాత్రికుల వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మెటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టిటిడి ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ నారాయణస్వామి, శ్రీ ఆళ్ల నాని, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస పూజారి, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీ మిథున్ రెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు యం.ఎల్.ఏలు, ధర్మకర్తల మండలి సభ్యులు డి.పి.అనంత, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ ఎ.రమేష్‌రెడ్డి, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ ఇ - 2 శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |