బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం
Published by:Admin, Date:25-09-2020:09:12

ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. 

 

     శ్రీ బాలసుబ్రహ్మణ్యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడనీ, తిరుమలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. 

16 భాషల్లో దాదాపు 40 వేల గీతాలు ఆలపించారని ఆయన చెప్పారు. గాయకుడిగా, నటుడిగా ఆయన ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని  శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ బాలు  మరణం  భారతీయ సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటన్నారు.  

  

       శ్రీ బాలు ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్రీ బాలు  కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: