సెప్టెంబ‌రు 29 నుండి తిరుమ‌ల‌లో  ''  షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష  '' 
Published by:Admin, Date:27-09-2020:04:45

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని సెప్టెంబ‌రు 29 నుండి అక్టోబ‌రు 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ కార్య‌క్ర‌మానికి సెప్టెంబ‌రు 28వ తేదీ రాత్రి  7.00 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్ఫ‌ణ నిర్వ‌హించ‌నున్నారు.  

 

       లోక క‌ల్యాణార్థం, కోవిడ్ - 19 కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొన్న ఆశాంతి, ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తొల‌గి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యాలు, ఆర్థిక‌ ప‌రిపుష్ఠి నెల‌కొల్ప‌డానికి 16 రోజుల‌ పాటు టిటిడి నిష్ణాతులైన వేద పండితుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంది.

 

    తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం జ‌రిగిన సుందరకాండ పారాయణంలో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ  '' రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః  ''  మ‌హామంత్రంలో 16 అక్ష‌రాలు ఉన్నా‌య‌ని, వాటి బీజాక్ష‌రాలు 68 అవుతుంద‌న్నారు. కావున టిటిడి ప్ర‌చురించిన సుంద‌ర‌కాండ‌లో 68 స‌ర్గ‌లు ఉన్నాయ‌ని, ఇందులో 2821 శ్లోకాల‌ను 16 రోజుల పాటు పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సీతా స‌మేతుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, ఆంజ‌నేయ‌స్వామివారి అ‌నుగ్ర‌హంతో  ప్ర‌పంచంలోని మాన‌వులు ధ‌ర్మాని ఆచ‌రిస్తూ, స‌క‌‌ల శుభాల‌ను పొందాల‌ని ఆకాంక్షిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హిస్తుంద‌న్నారు. 

 

     ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కొర‌కు ఎస్వీబీసీ ప్ర‌తిరోజు ఉద‌యం 9.00 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ది. fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: