బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం
Published by:Admin, Date:27-09-2020:04:58

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ. నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి.. కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో ముగ్గురు హీరోయిన్లు.. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను వేర్వేరుగా విచారించింది. ఈ సందర్భంగా వారిని.. ఎన్సీబీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. అయితే...ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా  ఈ డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను ఎన్సీబీ అధికారులు సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అదుపులోకి తీసుకున్నామని...తాజాగా నలుగురు హీరోయిన్ల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు వెల్లడించారు అధికారులు.



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: