తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
Published by:Admin, Date:05-07-2020:07:06

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాధ్, ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: